టీఆర్ఎస్ ప్లీనరిలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు అబద్దాలు, అభూత కల్పనలు మాట్లాడారని… పూనకం వచ్చినట్లు వ్యవహరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. బీజేపీ అంటే కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎనిమిదేళ్లుగా తెలంగాణకు ఏం చేశావో చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. యూపీఏ హాయాంలో మంత్రిగా పనిచేసిన నువ్వు తెలంగాణకు ఏం తెచ్చావని ప్రశ్నించారు. కనీసం ఆఫీసుకు కానీ.. క్యాబినెట్ మీటింగ్ కానీ వెళ్లలేదని విమర్శించారు. గుణాత్మక పాలన అంటే కల్వకుంట్ల పాలనా..? తండ్రి, కొడుకుల పాలనా..? అని ప్రశ్నించారు.
బీజేపీ వ్యతిరేఖ పార్టీలకు టీఆర్ఎస్ డబ్బులు… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-