ష‌ర్మిల‌ను ప‌ట్టించుకోని టీఆర్ ఎస్‌.. ఇలా అయితే క‌ష్ట‌మే..

-

తెలంగాణ రాజ‌కీయాల్లో ష‌ర్మిల చ‌క్రం తిప్పాల‌ని అనుకుంటే అంతా రివ‌ర్స్ అవుతోంది. ఆమె అనుకున్న‌ది మాత్రం నెర‌వేర‌ట్లేదు. ఇక‌పోతే ఆమె వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి నిరుద్యోగ యువత ఎజెండా తీసుకొని వ‌రుస‌గా అన్ని జిల్లాలు తిరుగుతూ దీక్షలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా ఆమె ఎన్ని దీక్ష‌లు చేసినా లేదంటే ఎన్ని నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నా కూడా అధికార టీఆర్ ఎస్ నుంచి పెద్దగా ప‌ట్టింపు లేక‌పోవ‌డంతో అది ఆమెకు పెద్ద ఇబ్బందిగా మారింది. కాగా ఆమె మాత్ర త‌న ప్ర‌య‌త్నం ఆప‌కుండా రీసెంట్ గా మ‌రో దీక్ష చేసింది.

Sharmila
Sharmila

వరంగల్ పట్టణంలోని హయగ్రీవాచారి గ్రౌండ్స్ సమీపంలో షర్మిల ప్ర‌స్తుతం నిరుద్యోగ నిరాహార దీక్ష చేసింది. ఇక ఈ దీక్ష సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ తాను ఎంతలా గ‌ళం వినిపిస్తున్నా కూడా సీఎం కేసీఆర్ మాత్రం ఎలాంటి రియాక్టు కావట్లేదని ఆమె చెప్ప‌డం చూస్తే ఆమె ఆవేదన కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. కేసీఆర్ సర్కారుకు తాను చేస్తున్న దీక్ష‌ల వ‌ల్ల చీమ కుట్టినట్లుగా కూడా అనిపించ‌ట్లేదని చెబుతున్నారు.

ఇక ఇలా కేసీఆర్ ఎంత‌లా స్పందించ‌క‌పోయినా కూడా తాను మాత్రం దీక్షలు చేస్తానని ఆమె చెప్పారు. అంటే ఆమె మాట‌ల్లో త‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌ట్లేద‌నే బాధ మాత్రం స్పష్టంగా క‌నిపిస్తోంది. ఇక కేసీఆర్ మెడలు వంచే వరకు దీక్షలు చేస్తాన‌ని, అందుకోసం త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాలంటూ యూత్‌ను కోరుతున్నారు ష‌ర్మిల‌. కేసీఆర్ త‌న కుటుంబంలోని ఐదుగురికి మాత్ర‌మే పదవులు ఇచ్చి తెలంగాణ నిరుద్యోగుల‌కు అన్యాయం చేశార‌ని బాగానే ప్ర‌శ్నిస్తున్నారు. కానీ ఆమె మాట‌ల‌కు ఏమాత్రం కూడా టీఆర్ ఎస్ రియాక్టు కావ‌ట్లేదు.

Read more RELATED
Recommended to you

Latest news