కారుకు కమలం చెక్: ఆ స్థానాలకు క్యాండిడేట్లు దొరికేశారు!

-

టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి ఎక్కడకక్కడ అవకాశాలు కోసం బీజేపీ బాగానే ప్రయత్నిస్తుంది. అయితే అప్పుడప్పుడు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీనే మంచి అవకాశాలు ఇస్తుంది. అసలు ఓ రకంగా చెప్పాలంటే తెలంగాణలో బీజేపీ ఎదగడానికి టీఆర్ఎస్‌నే కారణం…తమకు అడ్డు ఉండకూడదని కేసీఆర్ ప్రతిపక్షాలని తోక్కేశారు. దీంతో అనూహ్యంగా బీజేపీ పికప్ అయింది. పైగా ఈటల రాజేందర్ లాంటి నాయకులని బయటకు వెళ్లిపోయేలా చేసి ఇంకా హైలైట్ చేసింది.

bjp-trs

ఇలా ఎక్కడకక్కడ కమలానికి అవకాశం ఇస్తున్న కారు పార్టీ…త్వరలోనే ఇంకో భారీ అవకాశాన్ని ఇచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్‌కు ధీటుగా బీజేపీ ఎదుగుతున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ వస్తుంది…కాకపోతే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌కు చెక్ పెట్టేంత బలం బీజేపీకి లేదు. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీకి బలమైన నాయకులు, కార్యకర్తలు లేరు. దీంతో బీజేపీకి ఒక లోటు ఉందని మాత్రం అర్ధమవుతుంది.

ఆ లోటుని భర్తీ చేయడానికి బీజేపీ బాగానే ట్రై చేస్తుంది. అనుకున్న స్థాయిలో మాత్రం భర్తీ కాదనే చెప్పాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ రూపంలో బీజేపీకి మంచి అవకాశాలు దొరికేలా ఉన్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో కూడా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చింది..కానీ ప్రత్యేక పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్లి.. ఎమ్మెల్యేలందరికీ టిక్కెట్లు ఇచ్చారు. అప్పుడు ఎమ్మెల్యేల అంశం కాకుండా…కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలా వద్దా అన్న అంశమే తెరపైకి రావడంతో టీఆర్ఎస్ విజయం సాధ్యపడింది.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు…ఎమ్మెల్యేలపై ప్రజల అసంతృప్తి ఎక్కువగా ఉంది. దాదాపు సగం మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలిసింది. అందుకే ఈ సారి అలాంటి వారికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకూడదని కేసీఆర్ డిసైడ్ అయినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. ఇక టిక్కెట్ దక్కని నేతల కోసం బీజేపీ కాచుకుని కూర్చుంది. టిక్కెట్ లేదని క్లారిటీ వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేనూ తమ పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవల అమిత్ షా తమ పార్టీ నేతలకు అదే దిశలో దిశానిర్దేశం చేశారు. ఎవరు పార్టీలోకి వచ్చినా తీసుకోవాలని…బలంగా ఉన్న నేతలకు టిక్కెట్లు కూడా కేటాయించాలని చెప్పినట్లు సమాచారం. అంటే బీజేపీకి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులని ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version