మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. మూడు ప్రధాన పార్టీలు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ఎత్తుగడలో అనూహ్యంగా దూకుడు పెంచింది అధికార పార్టీ టీఆర్‌ఎస్. అయితే తాజాగా.. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా బోధన్ పరిధిలోని నవీపేట్ మండలంలో గురువారం పర్యటించిన టీఆర్ఎస్ నేత, బోధన్ ఎమ్మెల్యే మొహ్మద్ షకీల్ అమీర్ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు షకీల్ అమీర్.

మునుగోడు'లో గెలవకుంటే రాజీనామా చేస్తానంటూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలనం | IF  TRs not win in Munugode bypoll, I will resign my MLA post: Bodhan MLa  Shakeel - Telugu Oneindia

ఒక వేళ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవకుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు షకీల్ అమీర్. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కనీసం డిపాజిట్ కూడా దక్కదని అన్నారు షకీల్ అమీర్. 119 సీట్లలో 103 ఎమ్మెల్యేలను కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో లేనంత బలమైన ప్రభుత్వాన్ని తెలంగాణలో టీఆర్ఎస్ నెలకొల్పిందని ఆయన అన్నారు. ఇలాంటి బలమైన ప్రభుత్వాన్ని కూలదోసే యత్నాలకు బీజేపీ పాల్పడుతోందన్నారు. అయితే తెలంగాణలో బీజేపీ కుట్రలు సాగవని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news