రెండుసార్లు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చిన సరే…ప్రజల సమస్యలని పరిష్కరించడంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా వెనుకబడి ఉన్నట్లే తెలుస్తోంది. వరుసగా రెండుసార్లు గులాబీ నేతలకు కొన్ని నియోజకవర్గాల ప్రజలు అవకాశం ఇచ్చారు. అంటే 2014 2018 ఎన్నికల్లో గెలిపించారు. అయితే ఇలా రెండుసార్లు గెలిచిన వారిలో అంతకముందు ఎన్నికల్లో గెలిచిన వారు కూడా ఉన్నారు. అయినా సరే తెలంగాణ సెంటిమెంట్, కేసీఆర్ రాజకీయంతో చాలామంది గులాబీ నేతలు…వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచేసారు…పైగా రెండుసార్లు అధికారంలో ఉన్నారు. ఇలా రెండు సార్లు అధికారంలో ఉన్నా సరే…కొంతమంది ప్రజలకు పనులు చేసి పెట్టడంలో విఫలమైనట్లే కనిపిస్తున్నారు.
ఇప్పుడు వారే కేసీఆర్ కు పెద్ద టెన్షన్ మాదిరిగా తయారయ్యారు. అలారెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేలపైనే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉందని ఇటీవల సర్వేల్లో తెలుస్తుంది. ఆఖరికి పీకే టీమ్ సర్వేల్లో సైతం…ఆ ఎమ్మెల్యేలే ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తేలింది. ఇక అలాంటి ఎమ్మెల్యేలని గాడిలో పెట్టేందుకు కేసీఆర్ నానా తిప్పలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికీ వారు బలపడాలని చెప్పి ఇప్పటికే కేసీఆర్ దిశా నిర్దేశం చేసారు. కానీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం….ఇంకా బలపడటంలో వెనుకబడే ఉన్నట్లు తెలుస్తోంది.
పోని వారికి సీట్లు ఇవ్వకుంటే అదొక తలనొప్పి…కొంతమందిని అయితే మేనేజ్ చేయొచ్చు గాని,..దాదాపు 40-50 మందిని తప్పించాలంటే చాల కష్టం. దాని వల్ల ఇంకా నేతల్లో అసంతృప్తి పెరిగి అసలుకే మోసం వస్తుంది. అందుకే వారిని ఎలాగోలా బలోపేతం చేయాలనీ కేసీఆర్ చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలకు బలపడే అవకాశాలు తక్కువ ఉన్నాయి. దీంతో ఇంకా కేసీఆర్ కు టెన్షన్ పెరిగేలా ఉంది. వాళ్ళు గాని అలాగే కంటిన్యూ అయితే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి…అసలే ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ పార్టీలు దూసుకుంటూ వస్తున్నాయి. దీంతో కేసీఆర్ కు ఇంకా టెన్షన్ పెరిగేలా ఉంది..మొత్తానికైతే సొంత ఎమ్మెల్యేలే కేసీఆర్ ని బాగా టెన్షన్ పెడుతున్నారు.