టీడీపీ సర్వే రిపోర్ట్‌పై పేర్ని నాని ఫైర్‌

-

ఏపీలో సీఎం జగన్‌ గ్రాఫ్ అంత‌కంత‌కూ త‌గ్గిపోతోందంటూ విప‌క్ష టీడీపీ విడుద‌ల చేసిన ఓ స‌ర్వే రిపోర్టుపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని నిప్పులు చెరిగారు. ఈ స‌ర్వే చేప‌ట్టిన సంస్థ పేరు సెంటర్‌ ఫర్‌ నేషనల్‌ స్టడీస్ అని, అది టీడీపీ రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త రాబిన్ శ‌ర్మద‌ని ఆరోపించారు పేర్ని నాని. టీడీపీకి రాజ‌కీయ వ్యూహాలు అందిస్తున్న రాబిన్ శ‌ర్మ నేతృత్వంలోని సంస్థ వైసీపీకి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గన్‌కు వ్య‌తిరేకంగా రిపోర్టు ఇవ్వ‌కుండా మ‌రెలా ఇస్తుంద‌ని వ్యాఖ్యానించారు పేర్ని నాని.

Machilipatnam: Minister Perni Nani attacker taken into police custody for  questioning

అంతేకాకుండా.. పవన్‌ కల్యాణ్‌ ద్వారా త‌న‌ గ్రాఫ్‌ పెంచుకోవాలని టీడీపీ చూసింద‌ని, అయితే అది సాధ్యం కాలేదన్నారు పేర్ని నాని. తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, లోకేష్‌ వల్ల తెలుగుదేశం పార్టీ గ్రాఫ్‌ లేవడం లేదని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ తరువాత టీడీపీలో ఏం లేదని వాళ్లకు తెలిసిపోయిందని కూడా పేర్ని నాని వ్యాఖ్యానించారు. మునిగిపోతున్న టీడీపీని కాపాడుకోవడానికి, ప్రజల్లో భ్రమలు కల్పించడానికి బోగస్‌ సర్వేను బయటకు వదిలారన్న పేర్ని నాని.. ఇలాంటి సర్వేలు జ‌గ‌న్ గ్రాఫ్‌ను ఏమీ చేయ‌లేవ‌న్నారు. జగన్‌ గ్రాఫ్‌ను ఎవరూ తగ్గించలేరని, వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌ నాయకత్వంపైనా ప్రజల్లో బలమైన నమ్మకం, విశ్వాసం ఉన్నాయ‌న్నారు పేర్ని నాని.

 

Read more RELATED
Recommended to you

Latest news