మూడు పార్టీలతో పొత్తు.. కారుకు కలిసొస్తుందా?

-

గత రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పొత్తు లేకుండానే గెలిచి అధికారంలోకి వచ్చింది..2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ సింగిల్ హ్యాండ్ తో గెలిపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఏ పార్టీతో కూడా పొత్తుకు వెళ్లలేదు. కాకపోతే పరోక్షంగా ఎం‌ఐ‌ఎం పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారు..అలా అని ఎం‌ఐ‌ఎం అవసరం టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా రాలేదు. ఇలా రెండు ఎన్నికల్లో తిరుగులేని విజయాలు అందుకున్న కేసీఆర్‌కు..మూడో సారి పార్టీని తీసుకురావడానికి నానా కష్టాలు పడుతున్నారు…ఓ వైపు టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తుంది…అలాగే కొందరు ఎమ్మెల్యేలు మళ్ళీ గెలవడం కష్టమని సర్వేలు చెబుతున్నాయి.

ఇక ఎలాగో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటూ…టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టే దిశగా వస్తుంది. దీంతో ఈ సారి టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కడం అనేది కష్టమని అర్ధమైపోతుంది. అందుకే కేసీఆర్ కూడా చిన్నాచితక పార్టీలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటివరకు కమ్యూనిస్టులని దగ్గరకు రానివ్వని కేసీఆర్ ఇప్పుడు వాళ్ళ భజన చేస్తున్నారు. బీజేపీపై పోరాటానికి కమ్యూనిస్టుల మద్ధతు కావాలని అంటున్నారు.

ఇప్పటికే మునుగోడు ఉపఎన్నికలో సింగిల్ గా గెలవడం కష్టమని కేసీఆర్ కు అర్ధమైపోతుంది..అందుకే ఇలాంటి టైమ్ లో రిస్క్ ఎందుకని మునుగోడులో కాస్త బలంగా ఉన్న సి‌పి‌ఐ పార్టీని కలుపుకున్నారు. సి‌పి‌ఐ సైతం టీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్లు చెప్పింది. అలాగే సి‌పి‌ఎం సైతం కేసీఆర్ కు అనుకూలంగా ఉంది. ఇలా రెండు పార్టీలని కలుపుకుని మునుగోడులో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు.

మునుగోడుతోనే కాకుండా…రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఎన్నికల్లో సి‌పి‌ఐ, సి‌పి‌ఎం లకు కలిపి రెండు ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు ఇవ్వడానికి కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది..అటు ఎం‌ఐ‌ఎం సపోర్ట్ ఎలాగో ఉంటుంది…ఇలా మూడు పార్టీల మద్ధతుతో మళ్ళీ అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారు. మరి ఈ పొత్తు ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి. అసలు మునుగోడులో పొత్తు సక్సెస్ కాకపోతే కేసీఆర్ తర్వాత ఎలా ముందుకెళ్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news