కారు వర్సెస్ కమలం: పోరు పీక్స్..పైచేయి ఎవరిది?

-

 తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్ధం తారస్థాయికి చేరుకుంది. నువ్వా-నేనా అన్నట్లు కారు-కమలం పార్టీలు తలపడుతున్నాయి. ఎక్కడకక్కడ పైచేయి సాధించడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఒక పార్టీ ఏమో రాష్ట్రంలో అధికారంలో ఉండటం, మరొక పార్టీ ఏమో కేంద్రంలో అధికారంలో ఉండటంతో రెండు పార్టీలు ఎక్కడా తగ్గడం లేదు. అసలు రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.

bjp-trs

వరుసగా ఉపఎన్నికల్లో గెలవడం వల్ల కావొచ్చు…లేదా భవిష్యత్‌లో బీజేపీతో డేంజర్ అనే విషయం టీఆర్ఎస్‌కు బాగా అర్ధమైనట్లు ఉంది. అందుకే బీజేపీపై దూకుడుగా వెళుతుంది. బీజేపీని దెబ్బతీయడానికి ఎక్కడకక్కడ ప్రయత్నిస్తుంది. ఆ పార్టీ నేతల స్పీడుకు బ్రేకులు వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇటు బీజేపీ నేతలు మరింత దూకుడుగా టీఆర్ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్ మరింత దూకుడు కనబరుస్తున్నారు. ఇక తాజాగా జీవో 317కు వ్యతిరేకంగా పోరాటం చేసిన బండిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కేవలం కోవిడ్ నిబంధనల పేరుతో బండిని అరెస్ట్ చేశారు.

టీఆర్ఎస్ నేతలు ఎక్కడకక్కడ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అయినా సరే బండిని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష మాత్రమే అని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఇక జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రంగంలోకి దిగి…కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేయడం మొదలుపెట్టారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయడానికి పూనుకున్నారు.

అలాగే కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉపఎన్నికల్లో ఓడిపోవడంతో కేసీఆర్ మైండ్ పనిచేయడం లేదని ఫైర్ అయ్యారు. అటు టీఆర్ఎస్ నేతలు సైతం ఏ మాత్రం తగ్గడం లేదు. బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం తీవ్రంగా నడుస్తోంది. అయితే ఈ యుద్ధంలో ప్రస్తుతానికి కమలానిదే కాస్త పైచేయిలా కనిపిస్తోంది. మరి రానున్న రోజుల్లో వీరి మధ్య ఇంకెంత రచ్చ నడుస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version