తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్ బోర్టు శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 26న వెల్లడించే అవకాశాలున్నాయి. పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు అధికారులు. ఇంటర్ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి బోర్డు అధికారులు అను మతి కోరినట్టు తెలిసింది. ఫలితాల ప్రకటనపై ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు, ఈ ప్రక్రియ ఒకటి రెండురోజుల్లో పూర్తవుతుందనే ధీమాతో ఉన్నారు. తొలుత ఈ నెల 25న ఫలితాల వెల్లడిపై అధికారులు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం.
మూల్యాంకనం తర్వాత మార్కులను కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేశారు. ఈ క్రమంలో తప్పులు దొర్లినట్టు అధికారులు గమనించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సగటు ఫలితాల విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో తేడా ఉన్నట్టు తెలియడంతో కలవరపడ్డారు. దీంతో మరోసారి సమగ్ర విశ్లేషణకు సిద్ధమయ్యారు అధికారులు. అలాగే పదో తరగతి ఫలితాల విడుదలపై కూడా అధికారుల కసరత్తు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాలను కూడా వీలైనంత త్వరగా విడుదల చేసే అవకాశం ఉంది.