నవరాత్రులు మొదలయ్యాయి. అప్పుడే దుర్గాష్టమి కూడా అయ్యిపోయింది. చాలా మంది నవరాత్రులు జరుపుకుంటారు. తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి పూజలు చేయడం ఉపవాసాలు చేయడం మొదలైన పద్ధతులను అనుసరిస్తుంటారు.
మీరు కూడా నవరాత్రి పూజలు చేస్తున్నట్లయితే వీటిని తప్పకుండా చూడండి. నవరాత్రి పూజలు చేసే వాళ్ళు వీటిని కనుక ఆచరించాలంటే చక్కటి ఫలితాలను పొందవచ్చు. అయితే మరి వాటికోసమే ఇప్పుడు చూద్దాం.
తొమ్మిది రోజులు కూడా చాలా మంది ఎంతో నిష్టగా పూజలు చేస్తారు. నవ దుర్గలను ప్రతీ రోజు అంటే ఈ తొమ్మిది రోజులు కూడా పూజిస్తే మీకు దేవి అనుగ్రహం కలుగుతుంది. రాహుకాల వేళ రాహుకాల దీపంను ఈ తొమ్మిది రోజులు పెడితే మంచిది.
ఈ తొమ్మిది రోజులు కూడా లలితా సహస్రనామాలు, దుర్గాసప్తశతి పారాయణ చేస్తే అనుకున్నవి నెరవేరుతాయి. కనుక వీటిని అనుసరిస్తే మంచిది.
అదే విధంగా జాతకంలో అపమృత్యు దోషం కనుక ఉంటే తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించండి.
రోగ పీడలతో బాధపడే వాళ్ళు కూడా తొమ్మిది రోజులు అమ్మవారిని ఆరాధించండి. దీంతో ఆ బాధల నుండి బయటకు రావచ్చు.
అఖండ జ్యోతిని నవరాత్రి పూజ సమయంలో ఉంచితే చాలా మంచిది. మీరు ఇంట్లో పెట్టినప్పుడు కాస్త ఎత్తులో పెట్టండి.
చాలా మంది నవరాత్రి సమయంలో కన్య పూజ చేస్తారు. కన్య పూజ చేస్తే కూడా శుభం కలుగుతుంది. కనుక దీనిని కూడా ఆచరించండి. ఆనందాన్ని పొందండి.