తిరుమల శ్రీవారి భక్తులకు టిటిడి పాలకమండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి వయోవృద్ధులు అలాగే వికలాంగుల దర్శనాలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రతి రోజూ 1000 మంది చొప్పున భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ప్రకటన చేసింది టిటిడి పాలకమండలి.
శుక్రవారం మినహా మిగతా రోజుల్లో ఉదయం పదిగంటలకు, శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు అలాగే వికలాంగులకు దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించింది టిటిడి పాలకమండలి. కరోనా కారణంగా వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాన్ని టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు శ్రీవారి ఆలయంలో మార్చి 29 వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరు మంజనం తో పాటు వారాంతపు రద్దీ దృష్ట్యా భక్తులకు సర్వదర్శనానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. సాధారణ భక్తులకు మరింత ఎక్కువ దర్శన సమయం కల్పిం చేందుకు మార్చి 29వ తేదీన వి ఐపి బ్రేక్ దర్శనాలు కూడా టిటిడి రద్దు చేసింది.