సీమ ఎడారిగా మారడం ఖాయం: తులసి రెడ్డి

-

ఎగువ భద్ర ప్రాజెక్ట్తో సీమ ఎడారిగా మారక తప్పదని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి వెల్లడించారు . సీమలో ఉన్న తుంగభద్ర హైలెవల్ కెనాల్, లో లెవల్ కెనాల్, కేసీ కెనాల్ ప్రాజెక్టులు నీరు లేక నిరుపయోగం అవ్వటం ఖాయం అన్నారు తులసి రెడ్డి. సీమలోని 8 లక్షల ఎకరాల సాగుభూమి బీడవుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. నికర జలాల కేటాయింపు లేకుండానే కర్ణాటక ప్రభుత్వం ఎగువ భద్ర ప్రాజెక్ట్ను నిర్మిస్తోందని తులసిరెడ్డి వెల్లడించారు. ఎగువ భద్ర ప్రాజెక్ట్ను కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి 2023-24 బడ్జెట్లో రూ.5300 కోట్లు కేటాయించిందన్నారు.

ఇంత జరుగుతున్నా ఏపీ ప్రభుత్వం మిన్నకుండిపోతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే అప్పర్ భద్ర ప్రాజెక్టు పనులను నిలువరించాలని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లోనే దీనికి ప్రతిపాదనలు చేశారు. దాంతో ఆ రాష్ట్రంలో హర్షం వ్యక్తమవుతోంది. సుదీర్ఘకాలం పాటు కలగా ఉన్న ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందనే ఆశలు అక్కడ ప్రజల్లో కనిపిస్తున్నాయి. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తామంటోంది. రాయలసీమలో ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పర్ భద్ర పూర్తయితే సాగు, తాగు నీటి కష్టాలు వస్తాయని వారు భావిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news