శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం.. బాడీ శుభ్రంగా ఉండాలి.. చెమట కంపు కొడితే..ఎదుటివారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీ మీద ఒక బ్యాడ్ ఇంప్రషన్ క్రియేట్ అవుతుంది. అంత కంఫర్ట్‌గా మీతో మాట్లాడలేరు. అలాగే నోటి శుభ్రత కూడా ఇంకా ముఖ్యమైన విషయం.. మాట్లాడేప్పుడు నోట్లోంచి దుర్వాస వస్తే అసలు ఎవరూ మీకు దగ్గరగా వచ్చి మాట్లాడలేరు. మీరు మాట్లాడుతున్నా ఎప్పుడు ఆపుతాడ్రా బాబూ అనుకుంటారు. మీకు క్లోజ్ అయినవాళ్లు అయితే నోట్లోంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్తారు. మిగతా వాళ్లంతా వాళ్లలో వాళ్లు ఇబ్బంది పడి ఊరంతా చెప్తారు కానీ మీకు మాత్రం డైరెక్టుగా చెప్పరు.. హైలెట్ ఏంటంటే..మీ నోట్లోంచి దుర్వాసన వస్తే అది మీరు గమనించలేరు. ఎలాగైతే..తాగితే మన నోట్లోంచి మందు వాసన వచ్చినా అది మనకు తెలియదో అలా..! మరీ నోటి దుర్వాసనకు ఎలా చెక్ పెట్టడం….మౌత్ ఫ్రషనర్స్ కాసేపే..ఇంటి చిట్కాలే బెటర్. యాలుకలు తినమని అందరూ చెప్తారు..కానీ అవి నమలడం కాస్త ఇబ్బంది.. అందుకే మీకోసం..సింపుల్ చిట్కా తీసుకోవచ్చాం.. చిట్కా సింపులే..కానీ రిజల్ట్ మాత్రం పక్కా!
ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. నోటి సంరక్షణ, పరిశుభ్రతకి ఇది మంచి ఔషధం.. పసుపులో కర్కుమిన్ అనే ఆర్గానిక్, నాన్ టాక్సిక్ రసాయన సమ్మేళనం ఉంది. ఇందులో యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగానే పసుపు పీరియాంటల్ వ్యాధులు, నోటి క్యాన్సర్‌ల చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన పదార్ధంగా పనిచేస్తుంది. ఇది మౌత్ వాష్, దంతాల తెల్లబడేలా చేసేందుకు సహకరిస్తుంది. పసుపు కలిపిన నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.
పసుపు నీళ్ళు..
పసుపు నీటితో నోరు పుక్కిలించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. వాటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్.. ఒక గ్లాసు కోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ½ టీ స్పూన్ పసుపు వేసుకుని 2 చిటికెళ్ల నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. లేదంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకుని అందులో పసుపు వేసి బాగా మరిగించుకోవచ్చు. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు సాధారణ ఉప్పు కొద్దిగా కలుపుకోవచ్చు కూడా. పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటిని పుక్కిలిస్తే నోరు రోజంతా తాజాగా ఉంటుంది. పసుపుతో పుక్కిలించడం వల్ల నాలుక యల్లో షేడ్ అవ్వొచ్చు..నాలుగబద్దతో క్లీన్ చేసుకుంటే సరీ..!
పసుపు నీళ్ళతో ప్రయోజనాలు
పసుపు నీటిని పుక్కిలించడం వల్ల నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోటిలో పుండ్లు ఏవైనా ఉండి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఈ నీటిని కొద్ది సేపు నోట్లో ఉంచుకుని పుక్కిలించడం వల్ల వారంలోనే అద్భుత ఫలితాలు పొందవచ్చు.
పసుపు నీరు మౌత్ ఫ్రెషనర్ గాను ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన పోగొట్టి మంచి వాసన వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది.
నోట్లో ఉండే వైరస్, చెడు బ్యాక్టీరియాని చంపుతుంది.
చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
సీజనల్‌గా వచ్చే జలుబు, ఫ్లూ బారిన పడినప్పుడు నిరంతరం గొంతు నొప్పి ఉంటుంది. పసుపు నీళ్ళు వీరికి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.