‘సారీ తప్పయింది.. తిరిగి ఆఫీసుకు రండి’.. ఉద్యోగులకు మస్క్ మెయిల్

-

ట్విటర్​ను టేకోవర్ చేసిన తర్వాత టెస్లా అధినేత ఎలాన్ మస్క్ దాదాపు సగం మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ పూర్తిగా కాదు. ఏంటీ కన్​ఫ్యూజన్ అంటారా. తొలగించిన ఉద్యోగుల్లో కొంతమందిని తిరిగి ఆఫీసుకు రమ్మంటూ ట్విటర్ మెయిల్స్ పంపిస్తోందట. జాబితాలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల పొరపాటున కొంతమందిని ఇంటికి పంపించాల్సి వచ్చిందని మెయిల్​లో రాసుకొచ్చిందట. అలాగే మరి కొంత మంది నైపుణ్యాన్ని, అనుభవాన్ని గుర్తించడంలోనూ విఫలమైనట్లు ట్విటర్‌ భావిస్తున్నట్లు సదరు వ్యక్తులు తెలిపారు.

ట్విటర్​లో ఎలాన్​ మస్క్‌ లక్ష్యాలకు అనుగుణంగా మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం తొలగించిన ఉద్యోగుల్లో కొంతమంది సేవలు తప్పనిసరి అని సంస్థ భావిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవ్యక్తులు తెలిపారు. అందుకే వారిని తిరిగి ఆఫీసుకు రావాలని కోరుతున్నారట. దీనిపై ట్విటర్‌ యాజమాన్యంగానీ, అధినేత ఎలాన్‌ మస్క్‌ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news