ఎలాన్‌ మస్క్‌కు ట్విటర్‌ ఉద్యోగుల లేఖ.. అది కరెక్ట్ కాదంటూ..

-

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ట్విటర్ ఉద్యోగులు లేఖ రాశారు. సిబ్బందిని తొలగించాలనే ఆలోచన సరైంది కాదని తెలిపారు. అలా చేస్తే కంపెనీ కార్యకలాపాలు దెబ్బతింటాయని హెచ్చరించారు. మస్క్ ట్విటర్ ను కొనుగోలు చేస్తే చాలా మంది ఉద్యోగులను తొలగిస్తారని ఇటీవల వచ్చిన వార్తలతో ఆందోళన చెందిన ఉద్యోగులు ఎలాన్ మస్క్ కు లేఖ రాశారు.

ట్విటర్ ఉద్యోగులను తొలగిస్తే సమాచార బట్వాడాకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వ్యాఖ్యానించారు. యూజర్లకు ట్విటర్ పై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసినట్లేనని అన్నారు. పైగా ఉద్యోగులను బహిరంగంగా బ్లాక్ మెయిల్ చేసినట్లుగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఇలా నిరంతర వేధింపుల మధ్య పని చేయడం కష్టతరమని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు ప్రస్తుత, భవిష్యత్తు యాజమాన్యం ముందు ఉద్యోగులు కొన్ని కీలక డిమాండ్లను ఉంచారు.

అలాగే ప్రస్తుతం ట్విటర్‌ యాజమాన్యం కల్పిస్తున్న ‘ఇంటి నుంచి పని’ వంటి ప్రయోజనాలన్నింటినీ కొనసాగించాలని మస్క్‌ను కోరారు. ట్విటర్‌ను నడిపే విషయంలోనూ కంపెనీ ఉద్యోగులు, మస్క్‌ మధ్య సైద్ధాంతికపరమైన వ్యత్యాసం ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే జాతి, జెండర్‌, వైకల్యం, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఉద్యోగులపై పక్షపాతం చూపించొద్దని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news