Breaking: పెట్రోల్ దొరక్క రెండు రోజుల చిన్నారి మృతి!!

-

సంక్షోభంలో శ్రీలంక దేశం కొట్టు మిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ఆహార పదార్థాలు సైతం కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్‌తోపాటు నిత్యావసర వస్తువులు దొరకడం గగనమైంది. తాజాగా శ్రీలంకలో లీటర్ పెట్రోల్ దొరక్క పసికందు ప్రాణాలు పోయాయి. సెంట్రల్ హైలాండ్స్ లో 2 రోజుల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి పెట్రోల్ దొరకక చిన్నారి మరణించింది. ఈ విషాద ఘటన యావత్ ప్రపంచన్నే కలచివేస్తోంది.

చిన్నారి-మృతి
చిన్నారి-మృతి

హైలాండ్స్ లో నివసించే ఒక కుటుంబంలో రెండు రోజుల చిన్నారి ఉంది. ఆ చిన్నారికి కామెర్ల వ్యాధి వచ్చింది. దీంతో ఆ చిన్నారిని హల్దముల్లాలోని ఆస్పత్రికి తీసుకెళ్లాలని తండ్రి భావించాడు. అయితే ఆ చిన్నారి తండ్రి బైక్‌లో పెట్రోల్ లేదు. పెట్రోల్ కోసం బంక్ వద్ద క్యూలో నిలబడి చివరికి పెట్రోల్ సంపాదించుకున్నాడు. బైక్‌పై చిన్నారిని ఆస్పత్రికి కూడా తీసుకెళ్లాడు. ఎమర్జెన్సీ వార్డులో వైద్యులు చిన్నారికి వైద్యం కూడా ప్రారంభించారు. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. దీంతో చిన్నారి చికిత్స  పొందుతూ ప్రాణాలు విడిచింది.

ఈ విషయాన్ని ఆస్పత్రికి చెందిన జ్యూడిషియల్ మెడికల్ ఆఫీసర్ శనకరోషన్ పతిరానా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. సమయానికి లీటర్ పెట్రోల్ దొరక్క చిన్నారి ప్రాణాలు పోయాయని, ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news