ఎన్ని రోజుల ఉత్కంఠకు అతి త్వరలోనే తెరపడనుంది..ఎప్పుడెప్పుడా అని చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నికకు సమయం దగ్గరపడింది..ఇప్పటివరకు తెరముందు కథ నడవగా, ఇకపై తెరవెనుక కథ నడవనుంది. గత కొన్ని రోజులుగా రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంతో హుజూరాబాద్‌లో హడావిడి చేశాయి. ఎవరికి వారు శక్తి వంచన లేకుండా ప్రచారం చేశారు. ఇక గెలుపుపై టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎవరికి వారు ధీమాగా ఉన్నారు.
అయితే ప్రచారంలో ఎలాంటి రాజకీయ నడిచిందో..దానికి భిన్నంగా ప్రచారం ముగిశాక జరగనుంది…ప్రచారం ఎలాగో ముగిసింది…హుజూరాబాద్‌లో మైకులు మూగబోయాయి…ఇక ఇక్కడ నుంచే అసలు ఆట మొదలు కానుంది…హుజూరాబాద్‌లో గెలుపోటములని డిసైడ్ చేసే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఎన్నిక ముందు ఉన్న రెండు రోజులే కీలకంగా కానున్నాయి. అంటే ఆ రెండు రోజులే…28, 29 తేదీల్లో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ రెండు రోజుల్లో తెరవెనుక జరిగే రాజకీయం బట్టే…ఎన్నికల్లో గెలుపోటములు డిసైడ్ అయి ఉంటాయని చెప్పొచ్చు. ఇక ఈ కీలక ఘట్టంలో టీఆర్ఎస్, బీజేపీలు తమ శక్తి వంచన లేకుండా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు రోజులు….రాజకీయ నాయకులే కాదు…ప్రజలు కూడా నిద్రపోయే పరిస్తితి కనిపించడం లేదు. 28, 29 తేదీల్లో తెరవెనుక జరిగే ప్రచారం అభ్యర్థుల గెలుపు ఓటముల్ని ప్రభావితం చేయనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ రెండు రోజులే ఓటర్లని ప్రలోభ పెట్టే కార్యక్రమాలు జరగనున్నాయి. ఓటుకు రేటు కట్టి మరీ…పార్టీలు ఓటర్లకు నోట్లని పంచనున్నారు. అయితే గతనికి భిన్నంగా హుజూరాబాద్ ఉపఎన్నిక జరగనుంది…అందుకే ఈ ఎన్నికలో గెలవడం అటు టీఆర్ఎస్కు, ఇటు బీజేపీకి ప్రతిష్టాత్మకం అయిపోయింది. దీనికి ఎంత ఖర్చు పెడతారో కూడా క్లారిటీ లేదు….ఇక ఎవరికి వారే ఓటుకు ఎంత ఇచ్చి అయినా గెలవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. మరి చూడాలి హుజూరాబాద్ ప్రజలు డబ్బులకు లొంగుతారో…అభిమానానికి కట్టుబడి ఉంటారో.