కశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

-

జ‌మ్మూక‌శ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో భార‌త బ‌ల‌గాలు ఇద్ద‌రు ల‌ష్క‌రే ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టాయి. చ‌క్‌తార‌స్ కంది ఏరియాలో ఉగ్ర‌వాదులు త‌ల‌దాచుకున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలో బ‌ల‌గాలు, పోలీసులు క‌లిసి సంయుక్తంగా కూంబింగ్ నిర్వ‌హించారు. బ‌ల‌గాల కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. ఇందులో ఒక‌రు పాకిస్తాన్‌కు చెందిన తుఫెయిల్ ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

Pakistani terrorist killed in encounter in J&K's Sopore - India News

ఆ ఏరియాలో ఉగ్ర‌వాదుల కోసం బ‌ల‌గాల వేట కొన‌సాగుతోంది. సోమ‌వారం నాడు బారాముల్లా జిల్లాలో ల‌ష్క‌రే తోయిబాకు చెందిన ఉగ్ర‌వాదిని బ‌ల‌గాలు మ‌ట్టుబెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల నుంచి ఉగ్రవాదుల దాడులు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రకుట్రను భారత భద్రత బలగాలు భగ్నం చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news