సాదారణంగా మనుషులకు కేవలం ఒక నాలిక మాత్రమే ఉంటుంది..మనుషులకు కాదు..భూమ్మీద జీవించే జీవరాశులకు అన్నిటికీ దాదాపు ఒక నాలిక మాత్రమే ఉంటుంది. రెండు ఆహార పదార్ధాలు మన ముందు ఉంటే ఒక దాని తర్వాత,మరొక దానిని తింటారు. కానీ ఓ యువతికి రెండు నాలికలు ఉన్నాయి.వాటితో రెండు రుచులను ఒకేసారి ఆరగిస్తుంది.అదేలా సాధ్యం.. అసలు ఆమెకు రెండు నాలికలు ఎలా ఉన్నాయి.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆ యువతి అమెరికాలో ఉంటుంది.కాలిఫోర్నియాకు చెందిన బ్రియన్నా మేరీ షిహాడే మాత్రం రెండు రకాల జ్యూస్ లను ఒకేసారి రుచిచూస్తుంది.ఆమె నాలుక ముందుభాగం రెండు పాయలుగా చీలి ఉంటుంది. దీంతో ఆమె ముందు రెండు రకాల తినుబండారాలు పెడితే వాటిని ఒకేసారి రుచిచూసి కరెక్ట్‌గా చెప్పేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. దీంతో షిహాడే ప్రతిభను చూసి నెటిజర్లు తెగ లైక్‌లు కొట్టేస్తున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది..ఆమె సర్జరీ ద్వారా తన నాలుకను రెండుగా స్ల్పిట్ చేయించుకుంది. ఇటీల ఆమె ఒక గ్లాస్ లో స్పైట్ కూల్ డ్రింక్, మరో గ్లాస్ లో మంచినీళ్లు పెట్టుకొని రెండింటిని ఒకేసారి తాగి తన స్ల్పిట్ నాలుకతో రెండింటి రుచులను చెప్పేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ గా మారింది..మీరు ఆ వీడియోను ఒకసారి చూసి, లైక్ ,కామెంట్ చేయండి..