కరోనా పని అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు.. కానీ అది వెనక అడుగు వేసిన పులి మాదిరి తయారయింది.. పులి నాలుగు అడుగులు వెనక్కు వేస్తే..నలభై అడుగుల స్పీడ్‌తో పంజా విసురుతుందని మనందరికీ తెలుసు.. కరోనా కూడా అంతే.. మహమ్మారి రెస్ట్‌లో ఉంది.. వేరియంట్లమీద వేరియంట్లలో రూపాంతరం చెందుతుంది. తాజాగా చైనాలో కరోనా కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 రెండు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే సబ్ వేరియంట్లు చైనాలోని అనేక రాష్ట్రాల్లో వెలుగుచూసింది.
వచ్చే శీతాకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ కేసులు పెరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని, ఇప్పటికే చైనాలోనే అనేక ప్రాంతాలకు వేగంగా స్ప్రెడ్ అయ్యాయని అంటున్నారు. ఓమిక్రాన్ BA.5.1.7, BF.7 రూపాంతరాలు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతాయని, మునుపటి రోగ నిరోధక శక్తిని సైతం తట్టుకోగలవని చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వేరియంట్ల వల్ల చైనాలోని షాంఘై సహా పెద్ద పెద్ద నగరాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధించారు. స్కూళ్లు, సినిమా హాళ్లు, పర్యాటక ప్రదేశాలను క్లోజ్ చేసి, కరోనా టెస్టులను వేగవంతం చేస్తున్నారు.
కరోనా వచ్చిన వారికి కూడా రావొచ్చు..
ఒమిక్రాన్ BF.7 వేరియంట్ ఇప్పటికే కరోనా సోకిన వ్యక్తులకు కూడా సోకే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు ప్రకటించారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) BF.7.. ఒమిక్రాన్ BA.5 సబ్‌వేరియంట్. BA.5 స్తబ్ధుగా ఉండగా, BA.4.6, BF.7 వేరియంట్లు ఇప్పుడు విజృంభిస్తున్నాయి.
కొద్ది రోజులుగా యునైటెడ్ స్టేట్స్‌లో కూడా 13 శాతానికి పైగా ఈ వేరియంట్లు వ్యాపించాయి. పూర్తి స్థాయి టీకాలు తీసుకున్నప్పటికీ BF.7 వేరియంట్ సోకుతుందని చెబుతున్నారు. కెంట్ విశ్వవిద్యాలయంలోని మాలిక్యులర్ మెడిసిన్ ప్రొఫెసర్ మార్టిన్ మైఖెలిస్ మాట్లాడుతూ.. కోవిడ్ వేరియంట్ అయిన BF.7 చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు. మరో వేవ్‌కు కారణమయ్యే సామర్థ్యాన్ని ఈ వైరస్ కలిగి ఉందని అంటున్నారు. యూకే ఆరోగ్య భద్రతా సంస్థ కూడా ఇదే విషయాన్ని తెలిపింది.
ఒమిక్రాన్ BF.7 వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్యం సంస్థ(WHO) కీలక ప్రకటన చేసింది. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. కొత్త వేరియంట్ చాలా ప్రమాదకరమని, జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. చలికాలంలో ఈ కేసులు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.
చైనాలో గత వారంలో యూరిపోయన్ యూనియన్‌లో కొత్త వేరియంట్ బారిన పడిన కేసలు 1.5 మిలియన్లకు చేరకున్నాయని WHO ప్రకటించింది. ఇది గత నెలతో పోలిస్తే 8 శాతం ఎక్కువ. బ్రిటన్‌తో పాటు అనేక దేశాలలో కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతుంది.
BF.7 చాలా డేంజర్..
CDC షేర్ చేసిన డేటా ప్రకారం అమెరికా అంతటా నమోదవుతున్న యాక్టీవ్ కేసులలో BF.7 బాధితులు 4.6 శాతంగా ఉంది. BA.5, BA.4.6. మొదటి రెండు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న వేరియంట్లుగా ఉన్నాయి. వాటి తరువాత స్థానంలో BF.7 ఉంది. ఇది ఇంకా బలపడే అవకాశం లేకపోలేదు. త్వరలోనే ముందున్న రెండు వేరియంట్లను మించిపోతుందని అంటున్నారు. త్వరలోనే మళ్లీ పాత రోజులు వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తత, జాగ్రత్తత విడవని నేస్తాలుగా మీ వెంటే ఉంటే..కొంతలో కొంతైనా బయటపడొచ్చు.