ఫిబ్రవరి 16 రష్యా మాపై దాడి చేస్తుంది…. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఫేస్ బుక్ పోస్ట్

-

రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తలు ప్రపంచాన్ని గందరగోళ పరుస్తున్నాయి. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే రష్యా తన సైనికి బలగాలను , క్షిపణి రక్షక వ్యవస్థలను, ఫైటర్ జెట్లను ఉక్రెయిన్ సరిహద్దు దగ్గరకు తరలించారు. ఏ క్షణానైనా.. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి ఎంటర్ కావచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఫేస్ బుక్ లో చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. ఫిబ్రవరి 16న రష్యా.. ఉక్రెయిన్ పై దాడి చేస్తుందంటూ.. ఫెస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. ఇదిలా ఉంటే ఇప్పటికే అమెరికా.. రష్యా యుద్ధం చేయడానికి సిద్ధం అయిందంటూ.. ప్రకటించింది. రష్యా మాత్రం అమెరికా మాపై అనవసర నిందులు వేస్తుందంటూ.. ఆరోపిస్తోంది. బెలారస్ దేశం మీదుగా రష్యా, ఉక్రెయిన్ లోకి ప్రవేశిస్తుందంటూ… వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా పలు యూరోపియన్ దేశాలు తమ పౌరులను ఉక్రెయిన్ నుంచి వచ్చేయాలని ఆదేశించాయి. అమెరికాతో పాటు మరికొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను మూసేశాయి. ఉద్రిక్తత ప్రభావం ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లపై కూడా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news