GHANI : మెగాఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..గని మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

మెగా హీరో వరుణ్‌ తేజ్‌.. వరుస హిట్ల తో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే గద్దల కొండ గణేష్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వరుణ్‌ తేజ్.. ప్రస్తుతం గని అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అల్లు అరవింద్ సమర్పణలో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ (బాబీ) ఈ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ ను వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా ప్రకటన చేసింది. ఫిబ్రవరి 25 వ తేదీన ఈ సినిమా విడుదల చేస్తోంది చిత్రబృందం. ఈ మేరకు వరుణ్‌ తేజ్‌ తో ఉన్న పోస్టర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ లో నూతన ఉత్సాహం మొదలైంది. కాగా.. గని సినిమా డిసెంబర్‌ లో విడుదల కావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news