ఉక్రెయన్-రష్యా యుద్ధం నేపథ్యంలో… విదేశీ విద్యార్థులకు హంగేరీ సూపర్ ఆఫర్

-

ఉక్రెయిన్ – రష్యా యుద్ధం చాలా విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఎన్నో ఆశలతో ఉక్రెయిన్ లోకి అడుగుపెట్టిన విదేశీ విద్యార్థులకు యుద్ధం అగమ్యగోచర స్థితిలో పడేసింది. ముఖ్యంగా ఇండియా నుంచి దాదాపు 20 వేల మంది వరకు ఉక్రెయిన్ లో వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. వీరితో పాటు చైనా, ఇండోనేషియా నుంచి కూడా విద్యార్థుల ఉక్రెయిన్ కు వెళ్తుంటారు. మనదేశంతో పోలిస్తే అక్కడ వైద్య విద్య సులభంగా దొరుకుతుండటంతో తల్లిదండ్రులు పిల్లలను అక్కడ చదివించేందుకు పంపిస్తున్నారు.

ఇదిలా ఉంటే యుద్ధం కారణంగా చాలా మంది విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేశారు. కొంత మంది విద్యార్థుల ఈ జూన్ లో తమ విద్యను ముగించుకునే సమయంలో యుద్ధం వచ్చిపడింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దు దేశం హంగేరీ సూపర్ న్యూస్ చెప్పింది. రష్యన్ సైనిక కార్యకలాపాల వల్ల ప్రభావితమైన విదేశీ విద్యార్థులకు హంగేరీలో చదువులు కొనసాగించడానికి హంగేరీ ఆఫర్ చేస్తుంది. ఈ నిర్ణయం ఇండియన్ స్టూడెంట్స్ కు కాస్త రిలీఫ్ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Latest news