ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్దం ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై బాంబుల వర్షం కురిపించారు. వాయు, జల, రోడ్డు మార్గాలలో ఉక్రెయిన్ దేశాన్ని రష్యా బలగాలు చుట్టు ముట్టాయి. దీంతో ఉక్రెయిన్ దేశ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అలాగే ఉక్రెయిన్ దేశంలో ఉన్న భారతీయులు.. తమ ను కపాడాలని మోడీ సర్కార్ ను కోరుతున్నారు. కాగ ఉక్రెయిన్ సమస్యపై కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు, పౌరులను తిరిగి భారత దేశానికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం .. ప్రత్యేకంగా విమానాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ రోజు రొమేనియాలోని బుకారెస్ట్ అనే ప్రాంతానికి రెండు విమానాలను కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది. అలాగే రేపు హంగేరిలోని బుడా పెస్ట్ నగరానికి ఒక విమానాన్ని పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగ ఉక్రెయిన్ లో చిక్కుకున్న ప్రతి భారతీయున్ని ఉచితంగానే విమాన సేవల ద్వారా భారత్ కు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.