ఉమ్రాన్‌ను వరించిన అదృష్టం.. టీమిండియాలో చోటు

-

ఐపీఎల్‌ సీజన్‌ 2022లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఆడి.. 150 కిమీ పైచిలుకు వేగంతో బంతులేస్తూ సంచలనం సృష్టించిన పేసర్ ఉమ్రాన్ మాలిక్ కు టీమిండియాలో చోటు దక్కింది. దక్షిణాఫ్రికాతో త్వరలో జరిగే టీ20 సిరీస్ కు నేడు టీమిండియాను ఎంపిక చేశారు. ఈ జట్టులో ఉమ్రాన్ మాలిక్ కు కూడా స్థానం కల్పించారు. అంతేకాదు, అర్షదీప్ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్, దీపక్ హుడా కూడా భారత జట్టుకు ఎంపికయ్యారు. పొట్టి ఫార్మాట్లో దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా మరోసారి జాతీయ జట్టులోకి వచ్చారు. కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు.

ఈ సిరీస్ లో భారత జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఈ టీ20 సిరీస్ జూన్ 9 నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఈ సిరీస్ లో మూడో మ్యాచ్ కు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అటు, ఇంగ్లండ్ తో గతంలో నిలిచిపోయిన ఐదో టెస్టుకు కూడా సెలెక్టర్లు జట్టును ఎంపిక చేశారు. అప్పట్లో భారత జట్టులో కరోనా కలకలం రేగడంతో ఈ టెస్టును రీషెడ్యూల్ చేశారు. ఈ మ్యాచ్ జులై 1 నుంచి 5వ తేదీ వరకు ఎడ్జ్ బాస్టన్ లో జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version