కొంపముంచిన సర్వే…హుజూరాబాద్‌లో ఊహించని ట్విస్ట్..!

-

రాజకీయాలు ఎప్పుడూ ఒకే పార్టీకి అనుకూలంగా నడుస్తాయని అనుకోవడం కష్టమనే చెప్పాలి. ఏదో ఒక పీరియడ్‌లో ఒక పార్టీకి బాగా కలిసొస్తుంది. అప్పుడు ఆ పార్టీకి తిరుగులేనట్లే ఉంటుంది. అలా అని ఎన్ని ఏళ్ళు అయినా తమకు తిరుగులేదని ఆ పార్టీ భావిస్తే చిక్కుల్లో పడక తప్పదు. ఇప్పుడు సేమ్ సీన్ తెలంగాణ రాజకీయాల్లో కనబడుతోంది. రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో కే‌సి‌ఆర్ నాయకత్వంలోని టి‌ఆర్‌ఎస్‌కు తిరుగులేదనే విధంగా రాజకీయాలు నడిచిన విషయం తెలిసిందే. రెండోసారి కూడా మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చేవరకు కే‌సి‌ఆర్‌కు ఎదురులేదన్నట్లే పరిస్తితి ఉంది.

Huzurabad | హుజురాబాద్

కానీ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు దాటాక అసలు బొమ్మ కనబడుతోంది. ప్రతిపక్షాలు వేగంగా పుంజుకున్నాయి. టి‌ఆర్‌ఎస్ పతనం మొదలైంది…కే‌సి‌ఆర్‌ పవన్ తగ్గిపోతుంది. తాజాగా సీ-ఓటర్ అనే నేషనల్ సర్వేలో అదే విషయం స్పష్టమైంది. దేశంలోనే అత్యంత ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న సీఎంల్లో కే‌సి‌ఆర్ టాప్‌లో ఉన్నారు. దాదాపు 30 శాతం ప్రజా వ్యతిరేకత కే‌సి‌ఆర్‌పై ఉంది.

అలాగే దేశంలోనే ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నవారిలో తెలంగాణ ఎమ్మెల్యేలు మూడో స్థానంలో ఉన్నారు. అంటే దాదాపు టి‌ఆర్ఎస్ ఎమ్మెల్యేలే. 23 శాతం పైనే ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారు. అంటే కే‌సి‌ఆర్ పతనం మొదలైపోయిందని అర్ధమవుతుంది. ఇక ఈ సర్వే ప్రభావం టి‌ఆర్‌ఎస్‌పై బాగా పడింది.

పైగా హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు ఈ సర్వే రావడం టి‌ఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ తగిలినట్లే….ఊహించని విధంగా వచ్చిన ఈ సర్వే వల్ల…హుజూరాబాద్‌లో టి‌ఆర్‌ఎస్ కొంప మునగడం ఖాయం. పైగా హుజూరాబాద్‌కు సంబంధించి కూడా సీఓటర్ సర్వే బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో బీజేపీకి 49 శాతం…టి‌ఆర్‌ఎస్‌కు 34 శాతం, కాంగ్రెస్‌కు 16 శాతం ఓట్లు పడనున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ఏదేమైనా ఈ సీ-ఓటర్ సర్వే…కే‌సి‌ఆర్ కొంపముంచేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version