వికేంద్రీకరణకు మద్దతుగా గోడపత్రికను వికేంద్రీకరణ జేఏసీ ఆవిష్కరించింది. ఈ నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణకు మద్దతుగా ప్రభుత్వం ముoదుకు వెళుతున్న సమయంలో కొంతమంది సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. మూడు రాజధానులకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని అన్నారు. ఉత్తరాంద్ర అభివృద్ధి చెందకూడదనే హక్కు ఎవరికి లేదన్నారు. ఉత్తరాంధ్ర మీదకు అమరావతి రైతులు దండయాత్ర చేస్తున్నారని విమర్శించారు. 15వ తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు పాదయాత్ర ఉంటుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. టీడీపీ ఉత్తరాంధ్రకు ఏం చేసిందని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్.
ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని వ్యవహారంపై రచ్చ సాగుతూనే ఉంది.. ఓవైపు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని విపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. మరోవైపు.. వికేంద్రీకరణ జరగాలి.. మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని చెబుతున్నారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. అమరావతి ప్రాంత రైతులు పాదయాత్ర చేస్తున్న వేళ.. విశాఖ రాజధాని కావాలంటూ.. ఓ ఉద్యమం జరుగుతోంది.. ఈ నేపథ్యంలో.. సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఉద్యమం హైదరాబాద్ కోసమే జరిగింది.. మళ్లీ అటువంటి తప్పు జరగకుండా చూడాలనే సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారని తెలిపారు.. అయితే, ఏకీకృత రాజధాని వల్ల భవిష్యత్తులో ప్రమాదం వాటిల్లితే బంగాళాఖాతంలో దూకడం తప్ప మరో మార్గం ఉండదంటూ సంచలన కామెంట్లు చేశారు.