మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరగనున్న ఈ వేడుకలకు బీజేపీ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేసింది.
ఉత్సవాలకు ముఖ్య అథితిగా హాజరు అయిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా.. మువ్వన్నెల జెండాను ఎగరవేశారు. శుక్రవారం రాత్రే ఆయన హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక ఇవాళ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అమిత్‌షా… జాతీయ జెండాను ఎగురవేశారు.
ఇక అటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడకలు కొనసాగుతున్నాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నివాళులు అర్పించారు. అనంతరం బండి సంజయ్ జాతీయ జెండా ఎగురవేశారు.
Telangana | Union Home Minister Amit Shah participates in Telangana Liberation Day celebrations at Parade Ground, Hyderabad pic.twitter.com/DWFyhvQJFE
— ANI (@ANI) September 17, 2022