సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు

-

పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషి హైదరాబాదులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయం దిల్ సుక్ నగర్ లోని సాయిబాబా దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రహ్లాద్ జోషి.. ఆ తర్వాత మలక్పేట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బిజెపి కార్యాలయాన్ని మాజీ ఎంపీ ఇంద్రసేనారెడ్డి తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కెసిఆర్ కారణంగానే దేశంలో అత్యంత అవినీతిమయ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నడ్డాకు సమాధి కట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్, టిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కు లొంగిపోయాయని ఆరోపించారు. కెసిఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news