భీమ్లానాయక్ పై స్పందించని బన్నీ… ఆర్ ఆర్ ఆర్ పై సంచలన ట్వీట్..!

-

శుక్ర వారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆర్ఆర్ఆర్ భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది.ఈ సినిమా పై అల్లు అర్జున్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్ఆర్ఆర్  మూవీ విజయవంతం కావడానికి సహకరించిన మొత్తం టీం కి తన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు. మా బావ రామ్ చరణ్ కి ఇంతటి అద్భుతమైన విజయాన్ని అందించిన దర్శకధీరుడు రాజమౌళి గారికి కృతజ్ఞతలు.రామ్ చరణ్ ని తన సోషల్ మీడియా ద్వారా ట్యాగ్ చేస్తూ బెస్ట్ ఫర్ ఫార్మర్ గా అభివర్ణించారు.రాజమౌళి గారిని కూడా ట్యాగ్ చేసి తన అభిమాననాన్ని వ్యక్తం చేసారు. అయితే భీమ్లానాయక్ సినిమా మీద స్పందించకుండా ఆర్ ఆర్ ఆర్ పై స్పందించినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా వేదికగా పవర్ హౌస్ అని మెగా కుటుంబాన్ని అల్లు అర్జున్ పొగిడారు. కాగా భీమ్లానాయక్ సినిమా పై స్పందించకపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news