ముస్లిం యువకుడి ఛాతి పై యూపి సీఎం టాటూ..వైరల్..

-

మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యలు వివాదాలకు, విమర్శలకు దారి తీసింది.అంతేకాదు రాజకీయాల్లో చిచ్చు పెట్టిన సంగతి అందరికి తెలుసు..దేశవ్యాప్తంగా చెలరేగిన మంటలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్నాయి. ఇలాంటి పరిణామాలు నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఒక ముస్లిం యువకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ చిత్రాన్ని టాటూ వేయించుకున్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తుంది.

యూపీలోని ఈటా జిల్లా అలీగంజ్ తాలూకాలోని కస్బ సరై అఘాత్ ప్రాంతానికి చెందిని ఓ యువకుడు యామీన్ సిద్దిఖీ.యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అంటే ఈ యువకుడికి ఎంతో ఇష్టం. ఆయనే తన రోల్ మోడల్ అని సిద్దిఖీ చెప్పుకొచ్చాడు.యోగిపై అతనికి ఎంత అభిమానమంటే ఆయన ఫొటోను ఛాతిపై టాటూ వేయించుకున్నాడు.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సిద్దిఖీ అనే ఈ యువకుడు ఒక ఫుట్‌వేర్ వ్యాపారి. ఒకప్పుడు సమాజ్‌వాదీ జెండా మోసిన ఇతను యోగి ప్రభుత్వ పనితీరు నచ్చి అతనికి పెద్ద అభిమానిగా మారాడని చెబుతున్నాడు..సీఎం యోగి నేరస్తుల నుంచి పేదవారిని కాపాడుతున్నాడని, మంచి పనులు చేస్తున్నారని ఈ యువకుడు కితాబిచ్చాడు. ఆకతాయిలపై చర్యలు తీసుకోవడంలో యోగి ఆదిత్యనాథ్ అస్సలు ఆలస్యం చేయరని, అందుకే అతని ముఖాన్ని ఇలా టాటూ వేయించుకున్నాడు..ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news