వచ్చే నెల ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాది పార్టీలో చేరారు. బహుజన సమాజ్‌వాది పార్టీకి చెందిన మౌర్య 2016 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. ఆయన పద్రౌనా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరోవైపు ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచింది. గత ఐదేండ్ల పాలనా కాలంలో యోగి సర్కార్ సాధించిన విజయాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కమలం కార్యకర్తలు ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించింది. ఐదుగురితో కూడిన కార్యకర్తల సమూహం డోర్ టూ డోర్ వెళ్లి యోగి సర్కార్ పాలన గురించి వివరించనున్నారు. ఈ నెల 14 నుంచి ‘ఎల్‌ఈడీ వాహనాల’తో ప్రచార కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనున్నారు. గత ఐదేండ్ల కాలంలో యోగి సర్కార్ సాధించిన విజయాలను పెద్ద పెద్ద ఎల్‌ఈడీ టీవీల ద్వారా ప్రచారం చేయనున్నారు.