లఖీంపూన్ ఖేరి ఘటన మంటలు చల్లారడం లేదు. యూపీలో లఖీంపూర్ ఘటనలొ రైతులు మరణించడం తెలిసిందే.. ప్రతిపక్షాల నిరసనలతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. రైతుల మరణం తరువాత నుంచి ఏదో ఒక నిరసన కార్యక్రమంతో కాంగ్రెస్, రైతు సంఘాలు కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను టార్గెట్ చేస్తున్నాయి. ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరుతున్నారు. రైతుల మరణాలకు ప్రధాన కారణంగా చెబుతున్న కేంద్రమంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను యూపీ పోలీసులు అదుపుతోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజా మరోసారి కేంద్రమంత్రి రాజీనామాను కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా రైల్ రోకోకు పిలుపునిచ్చింది.
చల్లారని రైతుల కోపం.. కేంద్రమంత్రి రాజీనామా లక్ష్యంగా నేడు రైల్ రోకో
-