అఖిలేష్ యాదవ్, ఎస్పీకి ఉగ్రవాదులతో సంబంధాలు… యూపీ డిఫ్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

-

ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు ముగిసినా…. రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తగ్గడం లేదు. తాజాగా యూపీ డిఫ్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ పార్టీ, అఖిలేష్ యాదవ్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యలు చేశారు. 2013లో జరిగిన ఉగ్రవాదుల దాడుల కేసులను కూడా వెనక్కి తీసుకున్నాడని గుర్తు చేశారు. ఇటీవల గోరఖ్ నాథ్ ఆలయంపై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. గోరఖ్ నాథ్ ఆలయంపై అహ్మద్ ముర్తాజ అబ్బాసీ దాడి చేశాడు. అయితే ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ నిందితుడి మానసిక పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలని క్షమించాలని కోరారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని అతని తండ్రి చెప్పినట్లు అఖిలేష్ యాదవ్ అన్నారు.

అఖిలేష్ యాదవ్ చేసిన ఈ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలేష్ యాదవ్ ఉగ్రవాదులకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారని.. సీఎంగా పనిచేసిన ఆయన ఈ విధంగా మాట్లాడకూడదని అన్నారు. గోరఖ్ నాథ్ ఆలయంపై జరిగిన దాడి తీవ్రమైనదని మౌర్య అన్నారు. ఎస్పీ చీఫ్ జాతీయ భద్రత కంటే ఓటు బ్యాంకు బుజ్జగింపుపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని అన్నారు. అఖిలేష్ యాదవ్, అతని పార్టీ ఉగ్రవాదులకు మద్దతుగా నిలుస్తుందని పలు సందర్భాల్లో బీజేపీ ఆరోపించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news