యూపీ వారియర్స్ చేతిలో ముంబయి ఇండియన్స్ కు తొలి ఓటమి

-

వరుసగా 5 మ్యాచ్ ల్లో గెలిచిన ముంబయి ఇండియన్స్న, ఈరోజు యూపీ వారియర్స్ చేతిలో పాలైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న ముంబయికి నేడు యూపీ వారియర్స్ అడ్డుకట్ట వేయడం జరిగింది. నేడు జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్… ముంబయి ఇండియన్స్ పై 5 వికెట్ల తేడాతో గెలిచారు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో కేవలం 127 పరుగులకు ఆలౌట్ కావడం జరిగింది. అనంతరం లక్ష్యఛేదనలో యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 129 పరుగులు చేసి విజయం సాధించారు.

డబ్ల్యూపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు తొలి ఓటమి రుచిచూపిన వారియర్స్

ఒక దశలో వారియర్స్ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోగా, తహ్లియా మెక్ గ్రాత్ (38), గ్రేస్ హారిస్ (39) కీలక భాగస్వామ్యంతో తమ జట్టును గెలుపు బాట వైపు తిప్పారు. వీరిద్దరూ అవుటైన తర్వాత సోఫీ ఎక్సెల్ స్టోన్ (16 నాటౌట్), దీప్తి శర్మ (13 నాటౌట్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ ను ముగించారు. ముంబయి బౌలర్లలో అమేలియా కెర్ 2, నాట్ షివర్ 1, హేలీ మాథ్యూస్ 1, ఇస్సీ వాంగ్ 1 వికెట్ తీశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news