పాదయాత్రపై పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు : వర్ల రామయ్య

-

పోలీసుల తీరుప అసహనం వ్యక్తం చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో, లోకేశ్ పాదయాత్రపై రాష్ట్ర డీజీపీకి వర్ల రామయ్య రిమైండర్ లేఖ పంపారు. లోకేశ్ యువగళం పాదయాత్ర అనుమతులకు సంబంధించి నేటి వరకు పోలీసు విభాగం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు.

ఈ నెల 27న పాదయాత్ర ప్రారంభం కానుందని, ఈ నేపథ్యంలో త్వరగా అనుమతులు ఇస్తే, ఏర్పాట్లు చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు వర్ల రామయ్య. లోకేశ్ యువగళం పాదయాత్రను కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు. అనుమతులు కోరుతూ చిత్తూరు జిల్లా ఎస్పీకి కూడా ఈ నెల 12న లేఖ రాశారు. ఇప్పటికీ అనుమతి రాకపోగా, టీడీపీ నేతలు మాత్రం పాదయాత్రపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news