ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ ని ఇలా మార్చుకోండి..!

-

మనకి వుండే డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు చాలా ముఖ్యమైంది. పాన్ కార్డు, రేషన్ కార్డు లాగ ఇది కూడా అన్నింటికీ అవసరం అవుతుంది. ఏ స్కీమ్స్ లో చేరడం మొదలు ఎన్నో వాటికి ఇది ప్రూఫ్ గా అవసరం. ఈ ఆధార్ కార్డ్స్ ని యూఐడీఏఐ ఇస్తుంది. ప్రతీ ఒక్కరు కూడా తప్పక ఆధార్ తీసుకోవాలి. అయితే ఆధార్ కార్డు ఉండి అందులో మొబైల్ నెంబర్ తప్పుగా ఉంటే అప్పుడు దానిని ఎలా మార్చాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మరి ఇక ఆలస్యం లేకుండా దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

కొన్ని కొన్ని సార్లు ఆధార్ కార్డు లో మొబైల్ నెంబర్ తప్పుగా పడే అవకాశం ఉండచ్చు. లేదా మీ మొబైల్ ని ఆధార్ తో లింక్ చేయకపోయి ఉండచ్చు. లేదు అంటే పాత నెంబర్ ఇంకా లింక్ అయ్యి ఉండచ్చు. ఇలాంటి సమస్య వస్తే ఏ ఇబ్బంది లేకుండా ఈ విధంగా ఫాలో అయితే సరిపోతుంది.

ఎక్కడికీ వెళ్లకుండా మీ ఇంటి వద్దకి పోస్ట్ మ్యాన్ వస్తే అతన్ని మీరు మొబైల్ నెంబర్ అప్డేట్ చెయ్యమని చెప్పండి. ఇలా ఈజీగా నెంబర్ మార్చచ్చు. లేదా సమీపం లో వుండే ఆధార్ అప్‌డేట్ సెంటర్ లో కూడా మార్చుకోచ్చు. దీనికి మీరు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అంతే ఆధార్ లో మొబైల్ నెంబర్ ని మార్చాలి అంటే ఇలా చేసుకోండి. త్వరగానే అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version