కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ అస్థవ్యస్తం అయిన సంగతి తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలా పరీక్షలు రద్దు కాగా.. కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే.. కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పలు పరీక్షల తేదీలను యూపీ ఎస్సీ ఇవాళ ప్రకటించింది. యూపీఎస్సీ ప్రకటించిన పరీక్షలు వివరాల్లోకి వెళితే… EPFO పరీక్ష సెప్టెంబర్ 5న, CAPF ఆగస్టు 8న, NDA II పరీక్ష నవంబర్ 14న నిర్వహించనున్నట్లు పేర్కొంది యూపీఎస్సీ. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్షలు జనవరి 7, 2022న ప్రారంభం కానున్నట్లు తెలిపింది.
ఈ పరీక్షలు జనవరి 7,8,9,15,16, తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది యూపీఎస్సీ. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఫిబ్రవరి 27, 2022 న ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు పది రోజుల పాటు మార్చి 8 వరకు కొనసాగనున్నాయి. సివిల్ సర్వీసెస్ 2020 కి సంబంధించిన ఇంటర్వూలను ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించనున్నామని వెల్లడించింది యూపీఎస్సీ.