US FDA ఊబకాయాన్ని తగ్గించడానికి Wegovy డ్రగ్ కి అనుమతి ఇచ్చింది..!

-

యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం నాడు బరువు తగ్గడానికి కొత్త రకం పాపులర్ డయాబెటిస్ Wegovy డ్రగ్  మందుని అప్రూవల్ చేసింది. క్రోనిక్ వెయిట్ మేనేజ్మెంట్ కోసం ఈ డ్రగ్ బాగా ఉపయోగపడుతుంది. క్యాలరీలని తగ్గించడం, ఫిజికల్ యాక్టివిటీని పెంచడంలో ఇది సహాయపడుతుంది.

పెద్దవాళ్ళలో క్రోనిక్ వెయిట్ మేనేజ్మెంట్ తగ్గించడానికి అప్రూవల్ చేసిన మొదటి డ్రగ్ ఇది. ఎక్కువ బరువు వున్నా ఒబెసిటీ వున్నా ఇది బాగా సహాయ పడుతుంది. ఈ డ్రగ్ పైన అరవై ఎనిమిది వారాల పాటు ట్రైన్స్ నిర్వహించారు.

దానిలో 4,100 పేషెంట్స్ ని తీసుకుని ట్రైల్స్ వేయగా 2600 పేషెంట్లు 68 వారాల పాటు వెగోవై తీసుకున్నారు. 1500 పేషెంట్లకు కంటే ఎక్కువ మంది 4 ట్రైల్స్ తర్వాత ప్లాసిబోని తీసుకున్నారు. 12.4 శాతం బరువు ప్లాసిబో తీసుకున్న వాళ్ళ కంటే వీళ్ళు తగ్గినట్లు తేలింది.

దీనిని తీసుకోవడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్:

టైప్ 2 డయాబెటిస్, గ్యాస్ట్రోఎంటర్టాట్స్, డైజెస్టివ్ డిస్ఆర్డర్ వున్న వాళ్ళల్లో కడుపులో తిప్పడం, కాన్స్టిపేషన్, కడుపు నొప్పి, తలనొప్పి, అజీర్తి, అలసట, బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడం ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు.

బరువు ఎక్కువగా ఉండటం, ఒబేసిటీ ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. హృదయ సంబంధిత సమస్యలు, హార్ట్ స్ట్రోక్, డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్స్ రావడానికి అవకాశాలు వున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version