ఓయూ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొనడంతో ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వారిని పరామర్శించేందు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం పోలీసుల అరెస్ట్ చేయడంపై టీ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డిని కలిసిన అనంతరం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ కి రాహుల్ గాంధీ తప్పకుండా వెళ్తారని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమంలో విద్యార్ధుల పాత్ర కీలకమని, ఉస్మానియా యూనివర్సిటీ కేసీఆర్ నా జాగీరు అనుకుంటున్నారని ఉత్తమ్ అగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం కట్టిన యూనివర్సిటీ అది అని, ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి పరిస్థితి లేదన్న ఉత్తమ్.. కేసీఆర్ వేసిన కమిటీ లక్ష 92 వేల ఖాళీలు అని చెప్పిందని, వాటికి ఎందుకు నోటిఫికేషన్ వేయలేదని ఆయన ప్రశ్నించారు. రాహుల్ గాంధీ 7 తేదీన న ఓయూకి వెళ్తారన్నారు. ఓ సామాన్య ఎంపీగా.. సామాన్యుడిగా వెళ్తారని ఉత్తమ్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సభ కూడా విజయవంతం చేయాలని రైతులను కోరుతున్నానన్నారు.