బిజేపి, టిఆర్ఎస్ సర్కార్ లపై ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. వడ్ల కొనుగోలు విషయం లో బీజేపీ..టిఆర్ఎస్ ల చేతగాని తనం స్పష్టంగా కనిపిస్తుందని… కెసిఆర్ అసమర్ధత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రైతులు కెసిఆర్ ని.. బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు ఉత్తమ్. లాస్ట్ ఇయర్ యాసంగి లో 52 లక్షల ఎకరాల్లో వరి పంట పండించారని.. 92 లక్షల టన్నుల ధాన్యం కొనేందుకు లక్ష్యం గా పెట్టుకున్నారని తెలిపారు.
ఇప్పుడు ఒకే సారి వరి వద్దు అని చెప్తే ఎలా ? అని నిలదీశారు. పంట మార్పిడి అంశం నిజంగా చేయాలని అనుకుంటే ఓ పద్ధతి ఉంటదని.. తుగ్లక్ నిర్ణయం .. సెన్స్ ఉండి నిర్ణయం తీసుకున్నారా..? అని నిప్పులు చెరిగారు. తెలంగాణ మంత్రులను ఏమని తిట్టాలో అర్దం కావడం లేదని.. 40 లక్షల టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం చెప్తే.. మీరు ఎందుకు ఒప్పుకున్నారు ? అని నిలదీశారు. ఆ రోజు మీరు నోరు మెదపకుండా …. ఇప్పుడు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల ఉసురు టిఆర్ఎస్ పార్టీకి తాకి తీరుతుందని హెచ్చరించారు ఉత్తమ్.