యూపీలో రాజకీయం రసవత్తంగా సాగుతోంది. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సమాజ్ వాదీ, బీజేపీ మధ్య రసవత్తంగా పోరు ఉంది. ఇప్పటికే ఈ రెండు పార్టీ మధ్య నేతల జంపింగ్ లు జరిగాయి. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ పై తాము పోటీ పెట్టడం లేదని ప్రకటించింది. కాంగ్రెస్ ఈ నిర్ణయంతో ఎస్పీకి దగ్గర కావాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీని ఓడించాలంటే… ఓట్లు చీలకుండా ఉండేందుకే కాంగ్రెస్ ఈనిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఎస్పీకి స్నేహ హస్తాన్ని అందించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
అఖిలేష్ ప్రస్తుతం యూపీలోని కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ ఈ స్థానం నుంచి జ్ణానవతి దేవికి టికెట్ ఇచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆమె అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసుకుంది. మరోవైపు బీజేపీ అఖిలేష్ పై పోటీకి కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ బఘేల్ ను బరిలోకి దింపింది.