వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఒక బీ టీమ్ లాంటిది : వీహెచ్‌

-

తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. బీజేపీపై పోరాడడానికే బీఆర్ఎస్ ఏర్పాటు చేశానని కేసీఆర్ చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని అన్నారు. బీజేపీతో డూప్ ఫైట్ చేయడానికే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని విమర్శించారు వి.హనుమంతరావు. వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఒక బీ టీమ్ వంటిదని అభివర్ణించారు. బీజేపీకి లబ్ది చేకూర్చేందుకు, తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభించారని ఆరోపించారు వి.హనుమంతరావు. రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును ఇక దేశంలో ఖర్చు చేస్తారని విమర్శించారు వి.హనుమంతరావు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో పంచుతున్నారని వి.హనుమంతరావు మండిపడ్డారు. కేసీఆర్ ను దేశం పిలుస్తోందంటూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమని వీహెచ్ కొట్టిపారేశారు వి.హనుమంతరావు.

- Advertisement -

V Hanumantha Rao: ఆ విషయాలపై ఇప్పుడేం మాట్లాడను.. క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్  సీనియర్ నేత.. | Congress senior leader v hanumantha rao thank to meets him  in hospital | TV9 Telugu

రాష్ట్రంలో ఏమీ చేయని కేసీఆర్, దేశంలో ఏదో చేస్తారంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు వి.హనుమంతరావు. అసలు విషయం ఆ పార్టీ నేతలకు కూడా తెలుసని, అయితే వారు కేసీఆర్ మెప్పుకోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు వి.హనుమంతరావు. తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తానని చెప్పి సోనియా గాంధీని మోసం చేసిన చరిత్ర కేసీఆర్ సొంతమని వీహెచ్ వెల్లడించారు. కేసీఆర్ ఇప్పుడు దేశంలోని రైతుల గురించి మాట్లాడతున్నాడని, రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ దని వి.హనుమంతరావు విమర్శించారు. దేశంలో ఏ పార్టీ కూడా కేసీఆర్ కు సహకరిస్తుందని తాను అనుకోవడంలేదని వి.హనుమంతరావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...