Breaking ; ఫ్రాన్స్‌ రచయిత్రికి నోబెల్‌ పురస్కారం

-

 

సాహిత్యంలో ప్ర‌తిష్ఠాత్మ‌క నోబెల్ బ‌హుమ‌తి ఫ్రాన్స్ ర‌చ‌యిత్రి అన్నీ ఎర్నాక్స్‌ను వ‌రించింది. ఈ మేర‌కు రాయ‌ల్ స్వీడిష్ అకాడెమీ గురువారం సాయంత్రం ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఫ‌ర్ ద కరేజ్ అండ్ క్లినిక‌ల్ అక్యూటీ… పేరిట రాసిన పుస్తకానికి గాను ఆమెకు నోబెల్ బ‌హుమ‌తి ద‌క్కింది. 1974లోనే ర‌చ‌న‌లు మొద‌లుపెట్టిన ఎర్నాక్స్‌… ఈ ఏడాది త‌న 82వ ఏట నోబెల్ బ‌హుమ‌తికి ఎంపిక‌య్యారు. సాహిత్యంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేసిన‌ ఎర్నాక్స్‌… ప్ర‌ధానంగా ఆటోబ‌యోగ్ర‌ఫీలు రాశారు. త‌న త‌ల్లిదండ్రుల‌తో త‌న అనుబంధం, త‌ద‌నంత‌రం త‌న జీవితంలో చోటుచేసుకున్న ప‌రిణామాల ఆధారంగా ర‌చ‌న‌లు చేశారు. తొలుత ఫిక్ష‌న్ న‌వ‌ల‌ల‌తోనే త‌న ప్ర‌స్థానం మొదలుపెట్టినా…ఆ త‌ర్వాత ఆటోబ‌యోగ్ర‌ఫీల దిశ‌గా ఆమె మారిపోయారు.

French writer Annie Ernaux awarded Nobel Prize in literature

1940లో నార్మండీలోని వైవోటోట్‌ అనే చిన్నపట్టంలో జన్మించిన ఎర్నాక్స్ 1974లో రచనలు మొదలుపెట్టారు. 82 సంవత్సరాల వయసులో నోబెల్ బహుమతి కి ఎంపికయ్యారు. సాహిత్యంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన ఎర్నాక్స్.. ఫిక్షన్ నవలలతోనే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టినా అనంతర కాలంలో ఆటోబయోగ్రఫీల వైపు వెళ్లారు. 1974లో ‘లెస్ ఆర్మోయిర్స్ వైడ్స్’, 1990లో ‘క్లీన్డ్ అవుట్’తో మంచి పేరు సంపాదించారు. కాగా, ఇప్పటికే వైద్యశాస్త్రం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రాల్లో నోబెల్ విజేతల పేర్లను ప్రకటించారు. వైద్యశాస్త్రంలో మానవ పరిణామ క్రమంపై చేసిన పరిశోధనలకు గాను స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త స్వాంటే పాబోకు నోబెల్ ప్రకటించగా, ‘పవర్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్‌’లో చేసిన పరిశోధనలకు గాను ముగ్గురు శాస్త్రవేత్తలకు భౌతికశాస్త్రంలో నోబెల్ లభించింది. అలాగే, రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ లభించింది. శుక్రవారం నోబెల్ శాంతి బహుమతిని ప్రకటిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news