మునావర్ ఫరూకి షో కు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. మునావర్ ఫరూకి షో కు అనుమతి ఇస్తే అడ్డుకుంటామని ఢిల్లీ వి హెచ్ పి, భజరంగదల్ నేతలు హెచ్చరికలు జారీ చేశారు. అటు ఇప్పటికే ఆగస్టు 28న ఢిల్లీలో షో కు దరఖాస్తు చేసుకున్నారు మునావర్ ఫరూకి. ఈ తరుణంలోనే మత విద్వేషాలు చెలరేగుతాయంటూ అనుమతి నిరాకరించారు ఢిల్లీ పోలీసులు.
ఇదే నెలలో బెంగుళూరు పోలీసులు సైతం మునావర్ షో కు అనుమతి నిరాకరించారు. అయితే… హైదరాబాద్ లో మాత్రం మునావర్ షో కు అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 20 న హైదరాబాద్ లో షో నిర్వహించారు మునావర్ ఫరూకి. మునావర్ షో తరువాత హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపు తప్పాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ లో షో కు అనుమతి నిరాకరించారు పోలీసులు. దీంతో మునావర్ ఫరూకి షో కు అటంకం ఏర్పడింది.