నిరుద్యోగులకు శుభవార్త.. ఏపీ దేవాదాయ శాఖలో త్వరలోనే ఖాళీల భర్తీ

-

దేవదాయ శాఖలో నాడు-నేడు తరహాలో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని…దేవాలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు దేవాదాయం శాఖ మంత్రి వెలంపల్లి. దేవదాయ శాఖలో వీలైనంత త్వరలో ఖాళీలను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. దేవదాయ శాఖలో ఇతర శాఖల అధికారులను నియమించక తప్పని పరిస్థితి అని… ఇతర శాఖలకు చెందిన హిందువులను మాత్రమే దేవదాయ శాఖలో నియమిస్తామని తెలిపారు.

దేవదాయ శాఖ భూములను లీజు తీసుకుని చట్టంలోని లొసుగులను ఆసరా చేసుకుని లీజు ఎగ్గొడుతున్నారని… దేవదాయ శాఖలో లీజు ఎగొట్టే వారి జాబితాను సిద్దం చేస్తున్నామని మంత్రి వెలంపల్లి స్పష్టం చేశారు. లీజు ఎగొట్టే వారి నుంచి అవసరమైతే భూములు వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుంటామని… దేవాదాయ శాఖలో గతంలో ఎన్నడూ జరగని విధంగా మార్పులు చేర్పులు చేశామన్నారు.

దేవదాయ భూములను కాపాడేందుకు చట్ట సవరణలు సహా అనేక నిర్ణయాలు తీసుకున్నామని… దేవదాయ శాఖలోని విజిలెన్స్ సెల్ ని మరింత బలోపేతం చేయనున్నాని తెలిపారు. ప్రముఖ దేవాలయాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలకు చర్యలు తీసుకుంటున్నామని… ఆన్ లైన్ విధానం ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు మంత్రి వెలంపల్లి.

Read more RELATED
Recommended to you

Exit mobile version