హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త…రేపటి నుంచి వ్యాక్సిన్‌ డ్రైవ్‌

-

హైదరాబాద్‌ ప్రజలకు శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్‌ రేపటి నుంచి వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనుంది సర్కార్‌. రేపటి నుంచి ప్రతి ఒక్కరికి కోవిడ్‌ వాక్సిన్ ఇచ్చేలా… కాలనీలు, బస్తీల్లో కోవిడ్‌ సంచార టీకా వాహనాలు తిరగనున్నాయి. పది రోజుల పాటు అర్హులైన అందరూ పౌరులకు వాక్సిన్ ఇవ్వనుంది సర్కార్‌. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు లు ఉమ్మడిగా వాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి.

Covid vaccine booster shot | కోవిడ్ వ్యాక్సిన్ బూస్ట‌ర్ షాట్

జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న 4846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్ లోని 360 వాదాలు, కాలనీల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పటికే 70 శాతంకు పైగా అర్హులైన 18 ఏళ్ల పైబడ్డ వారికి కోవిడ్‌ వాక్సిన్ అందగా… ఇంకా మిగిలిపోయిన వారికి ఇప్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది సర్కార్‌. దీని కోసం జీహెచ్ఎంసీ పరిధిలో 175 ప్రత్యేక సంచార వైద్య కోవిడ్‌ వాక్సిన్ వాహనాలు ఏర్పాటు చేయగా… కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖతో కలిపి ఏర్పాటు చేసింది. కాలనీలలో ఇంటింటికి వెళ్లి వాక్సిన్ వేసుకొని వారి జాబితా సేకరణ చేయనుంది. ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన ఈ 100 శాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని సర్కార్‌ యోచిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version