వైశాలి కిడ్నాప్ కేసు.. నేడు సీన్ రీకన్స్టక్షన్ చేయనున్న పోలీసులు

-

వైశాలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి కోర్టు అనుమతితో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శనివారం చర్లపల్లి జైలు నుంచి నవీన్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఆదిభట్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు.

మూడు రోజులపాటు నవీన్ రెడ్డి ని ప్రశ్నించనున్నారు. వైశాలి కిడ్నాప్ కి సంబంధించి పూర్తి వివరాలను రాబట్టడంతో పాటు.. నేడు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు. ఇప్పటికే ఈ కేసులో 36 మందిని పోలీసులు అరెస్టు చేయగా. తాజాగా ప్రధాన నిందితుడైన నవీన్ రెడ్డి, సోదరుడు సందీప్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news