మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి నామినేషన్ ని దాఖలు చేశారు. వంశీ చంద్ రెడ్డి దంపతులు పార్టీ ముఖ్య నేతలు మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి తర్వాత పార్టీ నాయకులు శ్రేణులతో కలిసి భారీ ర్యాలీలో జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే మంత్రి జూపల్లి ఢిల్లీ రాష్ట్ర అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. వివిధ మండలాల నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జై కొడుతూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు. ఒక కార్నర్ మీటింగ్ తర్వాత ఊరేగింపుగా కలెక్టరేట్ చేరుకున్నారు. రేవంత్ రెడ్డి తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు వంశీ చంద్ రెడ్డి.