వచ్చే ఎన్నికల్లోనూ మళ్ళీ నేనే పోటీ చేస్తా – ఎమ్మెల్యే వనమా

-

వచ్చే ఎన్నికల్లోనూ నేనే పోటీ చేస్తానని తెరాస ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాపై కుట్రలు జరుగుతున్నాయి.. నాపై ఓడినవారు నేను రాజీనామా చేస్తానని ప్రచారం చేస్తున్నారు.. ఐదేళ్లు నేను ఎమ్మెల్యేగా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేయించిన సర్వేలో 70 శాతం ప్రజల మద్దతు ఎమ్మెల్యే వనమా ఉందని ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా తెలియజేశారని అన్నాడు.

ఏ రాజకీయ నాయకుడైన ప్రజల మద్దతుతో గెలవాలి కానీ కుట్రలు, కుతంత్రాలతో గెలవాలనుకోవడం వారి అవివేకానికి నిదర్శనం, గ్లోబల్ ప్రచారాలతో ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరు అనే విషయాన్ని గ్రహించాలన్నాడు.కొత్తగూడెంలో మొన్నటి ఎన్నికల్లో ఓటమి పాలు అయినా జలగం వెంకట్రావు తాను మళ్ళీ వస్తానని ప్రచారం చేసుకుంటున్నారని పరోక్షంగా ఆయనపై వనమా వెంకటేశ్వరరావు కామెంట్ చేశారు. పగటి కలలు కనడం మానేయండి ఎమ్మెల్యే గా వనమా గెలిచిన దగ్గర నుండి ఇదే తంతు గ్లోబల్ ప్రచారం చేస్తూ ఇంకో పది రోజులు, వచ్చేనెల, ఇక అయిపోయింది అంటూ కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలను మబ్బు పెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news